ప్రొద్దుటూరు: రొటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థినులకు డ్రాయింగ్ పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, రైటింగ్ ప్యాడ్లను ఉచితంగా అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినుల్లో సృజనాత్మకత, గణిత నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు చదువుపై ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రొటేరియన్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Was this article useful?



