ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా స్పందించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రొద్దుటూరు అభివృద్ధిపై చేస్తున్న ప్రచారంలో వాస్తవాలు లేవని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు. అన్ని వర్గాలకు టీడీపీ సముచిత ప్రాధాన్యం కల్పించిందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభ్యర్థుల పనితీరును పరిశీలించి తీర్పు ఇస్తారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను ఎదుర్కొని టీడీపీ విజయం సాధిస్తుందని జబీవుల్లా ధీమా వ్యక్తం చేశారు.
Was this article useful?



