ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇర్ఫాన్ బాషా అన్నారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి, ఇర్ఫాన్ బాషా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పర విమర్శలు మాని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రొద్దుటూరులో తాగునీరు, పారిశుద్ధ్యం, దోమలు, ట్రాఫిక్ తదితర సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్కు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



