ప్రొద్దుటూరు: ముస్లింల పవిత్ర పండుగ మీలాద్ ఉన్ నభీ, మౌళిద్ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్థానిక ఆశార్ షరీఫ్‌ను సందర్శించారు. అంజుమాన్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు గంధం వేడుకలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కమిషనర్‌ను సంప్రదాయ పద్ధతిలో సత్కరించి, ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు, పారిశుధ్య నిర్వహణ కోసం ఆయన చేపడుతున్న చర్యలను అభినందించారు. కార్యక్రమంలో అంజుమాన్ కమిటీ సభ్యులు ఇలియాస్ ఖురేషి, టీడీపీ నాయకులు ఖలీల్ బాషా, శానిటేషన్ సూపర్వైజర్ నూర్ భాషా తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



