బద్వేలు, ఆగస్టు 24: బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో శ్రీ శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 16వ ఆరాధన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య స్వామి ఆశీస్సులు బద్వేలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Was this article useful?



