ప్రొద్దుటూరు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన గుర్తుతెలియని మహిళకు బంధువులు ఎవరూ లేకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ఆధ్వర్యంలో హిందూ శ్మశానవాటికలో హిందూ సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, సతీష్, రసూల్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఎవరూ లేని వారికి అండగా నిలిచి, అవసరమైన సమయంలో గౌరవప్రదమైన సేవలు అందించడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని సభ్యులు తెలిపారు.
Was this article useful?



