Breaking

యర్రగుంట్లలో పోలీసుల మెగా CASO ఆపరేషన్

యర్రగుంట్ల: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, జమ్మలమడుగు ఎస్‌డీపీవో వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో యర్రగుంట్ల పట్టణంలో పోలీసులు మెగా CASO ఆపరేషన్ నిర్వహించారు. 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టణంలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై నిఘా, అనుమానాస్పద ఇళ్లు, ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు మహిళల భద్రత కోసం శక్తి యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.