ప్రొద్దుటూరు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌కు ప్రొద్దుటూరు ఎడిఫై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వై. అమర్నాథ్రెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మరింత పట్టుదలతో పాల్గొని ప్రతిభ చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా పాఠశాలలో ప్రోత్సాహం, అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల విజయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.



