ప్రొద్దుటూరు: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ప్రొద్దుటూరులోని వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి, చిరంజీవి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి అభిమానుల అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ చిరంజీవి అభిమానులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆయన మరింత కాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో షరీఫ్ టైర్స్, చంద్రధర్, చల్లా రవికుమార్, సాగర్, బియ్యం కేశవ, జనసేన అడ్వకేట్ రమేష్, నెట్ బాషా, సుదర్శన్, ఇమామ్, బాబురావు, చెన్న రవి, రాము, సుబ్బరాయుడు తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.



