పులివెందుల: 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆర్డీవో చిన్నయ్య సూచించారు. ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గంలోని 309 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, కొత్త ఓటు కోసం ఫారం-6, అభ్యంతరాలకు ఫారం-7, మార్పులు, చేర్పులకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. 2026 జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Was this article useful?



