పోరుమామిళ్ల: గిరినగర్‌లో అశోక్ అనే యువకుడిపై బంధువులు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో కుటుంబ సభ్యులు అతడిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధానికి సంబంధించిన విషయాన్ని అశోక్ తన తల్లికి చెప్పడంతో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Was this article useful?



