ప్రొద్దుటూరు: రాజుపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో గొర్రెలు, పొట్టేళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు నాయకత్వం వహిస్తూ పరారీలో ఉన్న దేవరకొండ రమేష్ అలియాస్ వంకాయ ముక్కు రమేష్ (39)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విభూ కృష్ణ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ఎం. నాగభూషణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా, మొత్తం రూ.6.70 లక్షల నగదు, మహీంద్రా ఎక్స్‌యూవీ500 కారు, బొలెరో వాహనం, బజాజ్ పల్సర్ ఎన్ఎస్400 బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.



