ప్రొద్దుటూరు: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరులో మెగా అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావుతో పాటు పలువురు మెగా అభిమానులు పాల్గొన్నారు.
Was this article useful?



