తొండూరు: తొండూరు మోడల్ స్కూల్లో విద్యార్థినులకు మహిళా భద్రత, సాధికారత, సోషల్ మీడియా వినియోగంపై ఎస్ఐ శివ నాగిరెడ్డి అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీ వంటి సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. అత్యవసర సమయంలో 112, బాలల సహాయం కోసం 1098ను వినియోగించుకోవాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Was this article useful?



