బద్వేల్: బద్వేల్ అర్బన్ పోలీసుల పరిధిలో వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపాయి. పది రోజుల క్రితం నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించగా, పోలీసు సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఓ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపగా, రక్షక్ వాహనాల ఇద్దరు డ్రైవర్లను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. విచారణ ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంతో ఈ ఘటన బద్వేల్‌లో చర్చనీయాంశంగా మారింది.
Was this article useful?



