Breaking

రాయలసీమ నీటి సమస్యలపై ఉద్యమించాలి: రవి శంకర్ రెడ్డి

పులివెందుల: రాయలసీమలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆర్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రవి శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పులివెందుల వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో నీటి కొరత మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
గత ఏడాది పెన్నా నదిలోని సుమారు 112 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయి వృథా అయిందని తెలిపారు. కడపతో పాటు కోడూరు, పులివెందుల ప్రాంతాల్లో నీటి సమస్యపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రాయలసీమ సమస్యలపై వైసీపీ కూడా సమర్థవంతంగా పోరాడటం లేదని విమర్శించారు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ నెల 23న కడపలో జరిగే పౌర హక్కుల సంఘం సంతాప సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.