ప్రొద్దుటూరు: శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని పప్పుల బజార్ వీధిలోని శ్రీ గంగమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని వరమహాలక్ష్మి దేవీ అలంకరణలో ముస్తాబు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులను ఆకట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Was this article useful?



