కడప జిల్లా పులివెందులలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, దొండ్లవాగు శంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ఇళ్లలో కేంద్ర బలగాల భద్రత మధ్య అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతుండటంతో పులివెందులలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈడీ అధికారులు పలు కీలక అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోదాలకు గల పూర్తి కారణాలు, అధికారులు స్వాధీనం చేసుకున్న వివరాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
Was this article useful?



