వేంపల్లి: వేంపల్లి మండలం రాజీవ్‌నగర్ కాలనీలో వైఎస్సార్సీపీకి చెందిన సుమారు 30 కుటుంబాలు టీడీపీ నేత బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ కాలనీలోని డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్య సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిలిచిపోయిన చెరువుల పనులను పూర్తి చేసి పాపాఘ్ని నది ద్వారా రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో త్వరలో మరిన్ని కీలక చేరికలు ఉంటాయని పేర్కొన్నారు.
Was this article useful?



