ప్రొద్దుటూరు, ఆగస్టు 20: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ‘కమిషనర్‌తో ముఖాముఖి’ ఫోనింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. నాలుగు వారాల్లో మొత్తం 71 ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. వీధిలైట్లు, మంచినీరు, పారిశుధ్యం, రోడ్లు, ట్రాఫిక్ తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో 30 సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన ఫిర్యాదులను కూడా ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మున్సిపల్ యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కమిషనర్ కోరారు.
Was this article useful?



