పులివెందుల: టీడీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం, పులివెందుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని బీటెక్ రవి కోరారు.
Was this article useful?



