ప్రొద్దుటూరు, ఆగస్టు 20: మాజీ ప్రధాని, భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఇర్ఫాన్ బాషా అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. దేశాన్ని ఆధునికత వైపు నడిపించేందుకు ఐటీ, టెలికమ్యూనికేషన్, సాంకేతిక రంగాలకు రాజీవ్ గాంధీ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. యువతకు ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయడం వంటి నిర్ణయాలు దేశ ప్రగతికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇర్ఫాన్ బాషా పిలుపునిచ్చారు.
Was this article useful?



