Breaking

ప్రజల ముంగిటకు టీడీపీ.. సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రొద్దుటూరు: ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి టూ టౌన్ బైపాస్ ప్రాంతంలో పర్యటించారు. సంజీవనగర్ క్రాస్ నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల స్పందనను తెలుసుకున్నారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని లింగారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.