ప్రొద్దుటూరు, ఆగస్టు 20: పట్టణంలో దోమల బెడదను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఇర్ఫాన్ బాషా విమర్శించారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నేళ్లుగా సమస్య కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. 52 వార్డుల్లో దోమల నివారణకు అవసరమైన యంత్రాలు, సిబ్బంది, మౌలిక వసతులను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నియంత్రణ, పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Was this article useful?



