పులివెందుల: నియోజకవర్గంలోని రైతుల సాగునీటి అవసరాలను తీర్చేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.8 కోట్ల నిధులు మంజూరైనట్లు టీబీపీ హెచ్ఎల్సీ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి తెలిపారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీటెక్ రవి చొరవతో జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. నాయంచెరువు నుంచి చేపట్టే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పలు చెరువులను నింపి వేలాది ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 20 నీటి పథకాల్లో 16 పూర్తయ్యాయని, మిగిలిన వాటిలో సాంకేతిక సమస్యలను త్వరలో పరిష్కరించి నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు.
Was this article useful?



