జమ్మలమడుగు: ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తూ గురువారం జమ్మలమడుగు పట్టణంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి ఆవశ్యకతను వివరిస్తూ శాంతి సందేశాలను ప్రజలకు అందించారు.
ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతి, మానవతా విలువలను చాటుతూ నినాదాలు చేశారు. సమాజంలో పరస్పర సహకారం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మానవత స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Was this article useful?



