మీ ప్రేమభిమానాలు వెలకట్టలేనివి..! ముక్కా సాయివికాస్ రెడ్డి

రైల్వే కోడూరు, ఫిబ్రవరి 21:

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ముక్కా ఫౌండేషన్ కార్యదర్శి ముక్కా సాయి వికాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం నాడు కోడూరు నియోజవర్గం లోని  అన్ని ప్రాంతాలలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సాయి వికాస్ రెడ్డి పేరు మీద పూజలు, అభిషేకాలు నిర్వహించి, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రార్థించారు. కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టి జన్మదినాన్ని సేవా కార్యక్రమంలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ, తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అభిమానులు, కార్యకర్తల ఋణం తీర్చుకోలేనిదని అన్నారు. 

 

Facebook
X
LinkedIn
WhatsApp