కడప జిల్లా రాజంపేట పట్టణంలోని విద్యానగర్లో పెనిగలపాటి పిచ్చయ్యనాయుడు నూతన గృహప్రవేశ వేడుకకు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన గృహ యజమానులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంలో సుఖశాంతులు, సంతోషాలు, ఆయురారోగ్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
Was this article useful?



