రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం కటికంవారిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ సూపర్ మార్ట్ ప్రారంభమైంది. కటికం నాగేంద్ర ఆహ్వానం మేరకు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై సూపర్ మార్ట్‌ను ప్రారంభించారు.
సూపర్ మార్ట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సరుకులు అందుబాటులో ఉంచుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సంస్థ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించేలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



