రాయచోటి పట్టణానికి చెందిన ఓ పేద కుటుంబంలో ఆడబిడ్డ వివాహం నిశ్చయమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో వివాహ ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబం విషయాన్ని సోదరులు రియాజ్ జిన్నా సేవా సంస్థ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సంస్థ నిర్వాహకులు జిన్నా మహమ్మద్ షరీఫ్ వెంటనే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, వివాహానికి అండగా నిలిచారు. అనాథలు, అభాగ్యులు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తమ వంతు సహాయం అందిస్తూ జిన్నా సేవా సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. సహాయం కోరిన ప్రతి ఒక్కరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం అందించడంతో కుటుంబ సభ్యులు జిన్నా షరీఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.



