కడప, ఆగస్టు 19: జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఆధునీకరించిన ఆర్ఎస్ఐ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ బుధవారం ప్రారంభించారు. పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్ సమీపంలోని భవనాన్ని ఆధునీకరించి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు, విధుల నిర్వహణకు అనుకూలమైన వాతావరణంపై అధికారులతో చర్చించారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
Was this article useful?



