పులివెందుల: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ బి. శ్రీనివాసులు అధ్యక్షతన స్టార్టప్‌లపై అవగాహన సదస్సు నిర్వహించారు. కడప స్టార్టప్ హబ్ ప్రతినిధి సురేష్ లోక్‌నాథ్ ఉదయ్ పాల్గొని విద్యార్థినులకు స్టార్టప్‌ల ఆవశ్యకత, నూతన ఆలోచనలు, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించారు.
కలలు కనడంతో పాటు వాటిని ఆచరణలో పెట్టేందుకు తొలి అడుగు వేయాలని, వైఫల్యాలకు భయపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మలుచుకుని వినూత్న ఆలోచనలతో కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు. శ్రీనిత మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.



