ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు 93వ బూత్ ఇన్చార్జ్ దుగ్గిరెడ్డి రఘునాథ్‌రెడ్డి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this article useful?



