చక్రాయపేట, ఆగస్టు 19: మండలంలోని గంగారపువాండ్లపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా గాయపడిన కోటం నారాయణరెడ్డిని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి బుధవారం పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు.
బాధితుడికి అవసరమైన వైద్య సహాయం అందేలా తమ వంతు కృషి చేస్తామని ఉమాదేవి తెలిపారు. ప్రభుత్వం లేదా సంబంధిత శాఖల ద్వారా తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో గాయపడిన కుటుంబానికి అండగా నిలవాలని గ్రామానికి చెందిన కోటం గంగిరెడ్డి, సారెడ్డి నరసింహారెడ్డిని కోరారు.
Was this article useful?



