బద్వేలు, ఆగస్టు 19: బద్వేలు మున్సిపాలిటీ 21వ వార్డుకు చెందిన భైరపు చెన్నమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డిని ఆశ్రయించారు.
వెంటనే స్పందించిన ఆయన రూ.3,77,051 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఎల్ఓసీ లెటర్‌ను చెన్నమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంచూరు సూర్యనారాయణ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
Was this article useful?



