ప్రొద్దుటూరు: టీడీపీ నేత నాగరాజు చేసిన కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలపై మాజీ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి స్పందించారు. ఆరోపణలకు ఆధారంగా పేర్కొంటున్న ఆడియోను పూర్తిగా ప్రజలకు వినిపించాలని, రెండున్నర కోట్ల రూపాయల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.25 లక్షల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసుల విచారణ తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ, హజరయ్యను 15 రోజుల పాటు స్టేషన్‌కు పిలిపించిన అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వందల కోట్ల భూ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న వారు అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలని సవాల్ చేశారు. నిరాధార ఆరోపణలతో వ్యక్తులపై బురదజల్లకుండా పూర్తి విచారణ ద్వారా నిజానిజాలను తేల్చాలని బంగారు మునిరెడ్డి కోరారు.



