పులివెందుల: మున్సిపల్ ఎన్నికలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే వైఎస్సార్సీపీ కోర్టును ఆశ్రయిస్తోందని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. వార్డుల మార్పును కారణంగా చూపుతూ ఎన్నికలపై స్టే కోరుతూ హైకోర్టును ఆశ్రయించడాన్ని ఆయన తప్పుబట్టారు. పిటిషన్ను ఉపసంహరించుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
మైనర్ విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు తరలించడం సరికాదని బీటెక్ రవి అన్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థల అనుమతి లేకుండా విద్యార్థులను ధర్నాలకు తీసుకెళ్లడంపై బాధ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, తాడిపత్రి–ముద్దనూరు ఫోర్లేన్ రోడ్డు అనుసంధానం వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.



