వేంపల్లి: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ప్రారంభించారు. పట్టణంలోని ఆరు ప్రధాన ప్రవేశ మార్గాల్లో ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కెమెరాల ద్వారా పట్టణంలోకి వచ్చే, వెళ్లే వాహనాలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు నంబర్ ప్లేట్లను గుర్తించే సాంకేతికత అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, అనుమానాస్పద వాహనాల గుర్తింపులో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 18 లొకేషన్లలో 44 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, వేంపల్లి సీఐ నరసింహులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



