పులివెందుల, ఆగస్టు 18: సీనియర్ సిటిజన్లకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ప్రత్యేక వడ్డీ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు పులివెందుల బ్రాంచ్ సీనియర్ మేనేజర్ సందీప్‌కుమార్ రెడ్డి తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు మూడున్నరేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 7.8 శాతం వడ్డీ పొందవచ్చన్నారు. త్రైమాసికంగా వడ్డీ తీసుకునే సదుపాయం కూడా ఉందని తెలిపారు.
బ్యాంకులో ఏటీఎం, ఆర్టీజీఎస్, మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హౌసింగ్, ఎడ్యుకేషన్, సోలార్, ఆటో, కార్, గోల్డ్ రుణాలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Was this article useful?



