కడప: జిల్లాలో పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్, ఎండీకి లేఖ రాయడంతో పాటు ఫోన్లో సమస్యను వివరించారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 1,800 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రెండేళ్లుగా కనెక్షన్లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కనెక్షన్లకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లను వెంటనే విడుదల చేసి రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.
Was this article useful?



