Breaking

ప్రొద్దుటూరులో భూ దందాలపై టీడీపీ నేతల సంచలన ఆరోపణలు

ప్రొద్దుటూరు: పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమ భూ వ్యవహారాలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
శ్రీనివాసనగర్‌లోని విలువైన భూమిపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులు కన్నేశారని ఆరోపించారు. అధికారుల సీళ్లు, సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో అరెస్టయిన హజరయ్య భూ వ్యవహారాల్లో కీలక పాత్ర ఉందన్నారు. భూ దందాలకు సంబంధించిన వ్యవహారాలను రాచమల్లు సోదరుడు కిరణ్‌కు అప్పగించినట్లు హజరయ్య వెల్లడించిన విషయాన్ని నాగరాజు ప్రస్తావించారు.
అధికారం లేకపోయినా పనులు పూర్తి చేసి రూ.2.5 కోట్లు పొందినట్లు హజరయ్య చెప్పినట్లు తెలిపారు. పట్టణంలోని ఖాళీ స్థలాలకు సంబంధించిన సమాచారం అతని వద్ద ఉండేదని ఆరోపించారు. ఈ నెల 13న హజరయ్య అరెస్టయిన నేపథ్యంలో అతని వద్ద ఉన్న నగదును ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించారు. అలాగే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సమయంలో అధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి తీసుకువచ్చిన అంశంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
హజరయ్యను పోలీసు కస్టడీలోకి తీసుకుని భూ వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని టీడీపీ నేతలు కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే రాష్ట్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని నల్లబోతుల నాగరాజు తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.