ప్రొద్దుటూరు: పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ వార్డు అమినిటీస్ సెక్రటరీలను ఆదేశించారు. తాగునీటి సమస్యలపై నిర్వహించిన సమీక్షలో ప్రతి వార్డులో ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహించాలని, నీటి నాణ్యతను ప్రతిరోజూ పరీక్షించాలని సూచించారు.
నీటిలో కలుషితం, దుర్వాసన, సరఫరాలో అంతరాయం వంటి సమస్యలు గుర్తిస్తే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తెలిపారు. ఇకపై తాగునీటి సమస్యలపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.
Was this article useful?



