ప్రొద్దుటూరు: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సిబ్బందిని ఆదేశించారు. వార్డు సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ఆగస్టు 28లోపు సేకరించి డేటా షీట్లలో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, జనవరి 1, 2026ను ప్రామాణిక తేదీగా పరిగణించి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు.
Was this article useful?



