అమరావతి: ఏపీలో పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఆన్‌లైన్ ద్వారా అందించే మున్సిపల్ సేవలకు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీఓ నంబర్ 179ను జారీ చేసింది.
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను మదింపు తదితర సేవలకు ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేయనున్నారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ అనుమతులతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడంతో పాటు నకిలీ దరఖాస్తులను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Was this article useful?



