జమ్మలమడుగు: ముద్దనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 కబడ్డీ విభాగంలో మేఘన, శైలజ, ఖోఖోలో నవ్యదీప్తి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ నెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. విద్యార్థినుల ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Was this article useful?



