అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని జనసేన లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ లీడర్, మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సోమవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా జేఎల్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సభ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రతి చర్చలో సభ్యులు చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. నియోజకవర్గాల్లోని తాగునీరు, సాగునీరు తదితర సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను అనుసరిస్తూ సభ్యులంతా హుందాగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
Was this article useful?



