జమ్మలమడుగు: జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రఫిక్ భాష, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Was this article useful?



