ప్రొద్దుటూరు: కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని అమృతనగర్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. నూర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమృతనగర్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అమృతనగర్ ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



