Breaking

40 వార్డులుగా పులివెందుల మున్సిపాలిటీ

పులివెందుల: పులివెందుల మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజించేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఈ నెల 15న అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Roc.No.13033/14/2026/H1 ద్వారా మున్సిపాలిటీని 40 వార్డులుగా విభజిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వార్డుల పునర్విభజనతో పట్టణ పరిపాలన మరింత సులభతరం కావడంతో పాటు ప్రజలకు మున్సిపల్ సేవలను మెరుగ్గా అందించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పాలన, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడనుంది

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.