కడప జిల్లా: స్టైఫండ్ పెంపు డిమాండ్‌తో సమ్మె చేస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (APJUDA) రేపటి నుంచి అత్యవసర వైద్య సేవలను సైతం బహిష్కరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నాన్-ఎమర్జెన్సీ సేవలను నిలిపివేసి నిరసన చేపడుతున్న జూడాలు.. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతి రెండేళ్లకు 15 శాతం స్టైఫండ్ పెంపు జరగాల్సి ఉండగా, అది ఏడు నెలలకు పైగా ఆలస్యమైందని జూడాలు పేర్కొన్నారు. పెరిగిన ఖర్చులు, పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని 30 శాతం పెంపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం 3 శాతం పెంపును ప్రతిపాదించడంతో చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.



